మేడిగడ్డలో 93 లక్షల టన్నుల ఇసుక మేట.. త్వరలో టెండర్లు

76చూసినవారు
మేడిగడ్డలో 93 లక్షల టన్నుల ఇసుక మేట.. త్వరలో టెండర్లు
మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో దాదాపు 93 లక్షల టన్నుల ఇసుక మేటలు ఉన్నట్లు ఖనిజాభివృద్ధి శాఖ గుర్తించింది. మొత్తం 14 బ్లాకుల్లో ఉన్న ఇసుకను తొలగించి విక్రయించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కుంగిన మేడిగడ్డను రిపేర్ చేసేందుకు ఇసుక మేటలు అడ్డుగా ఉన్నాయని, గోదావరికి వరద నీరు వచ్చేలోపు ఆ ఇసుకను తొలగించనున్నట్లు స్పష్టం చేశాయి.