పిస్టల్‌ను ఆటబొమ్మ అనుకుని బ్యాగ్‌లో వేసుకుని.. స్కూల్‌కు తీసుకువెళ్లిన ఢిల్లీలోని 10 ఏళ్ల బాలుడు

51చూసినవారు
పిస్టల్‌ను ఆటబొమ్మ అనుకుని బ్యాగ్‌లో వేసుకుని.. స్కూల్‌కు తీసుకువెళ్లిన ఢిల్లీలోని 10 ఏళ్ల బాలుడు
ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 10 ఏళ్ళ బాలుడి నుంచి మ్యాగజీన్ లేని పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, శనివారం నాడు ఓ బాలుడు ఆటబొమ్మ అనుకుని పిస్టల్‌ను బ్యాగ్‌లో వేసుకుని స్కూల్‌కు వెళ్లాడు. అది గమనించిన పాఠశాల నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన తుపాకీ లైసెన్స్ కొన్ని నెలల క్రితం చనిపోయిన సదరు బాలుడి తండ్రి పేరు మీద ఉందని పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్