బెంగళూరులో 133 ఏళ్ల రికార్డు బ్రేక్

52చూసినవారు
బెంగళూరులో 133 ఏళ్ల రికార్డు బ్రేక్
కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ క్రమంలో జూన్ నెలలో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతానికి సంబంధించిన 133 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్ అయింది. జూన్ 2వ తేదీన బెంగళూరులో 111.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో 1891 జూన్ 16న నగరంలో 101.6 మిమీ వర్షపాతం నమోదు కాగా.. ఆ రికార్డుకు తాజా బ్రేక్ పడింది. రెండు రోజుల్లో ఏకంగా 140.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్