రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. నగరంలోని మహాత్మగాంధీ ప్రభుత్వాసుపత్రిలో 15 ఏళ్ల బాలికపై ఆదివారం ఇద్దరు నిందితులు సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లో తల్లితో గొడవ పడి ఆసుపత్రి వద్దకు బాలిక చేరుకుంది. ఆమెతో నిందితులు మాటలు కలిపారు. అనంతరం ఆసుపత్రి వెనుకభాగానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.