ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ళ యువతి ప్రియుడు సౌరభ్ సింగ్‌తో గొడవపడి.. కోచింగ్ సెంటర్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. యువతి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.