చెన్నైకు చెందిన 23 ఏళ్ల యువతి 15 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడి, కలిసి జీవించేందుకు అతడిని పుదుచ్చేరికి తీసుకెళ్లింది. ఆ బాలుడు పదోతరగతిలో ఫెయిలై ఆ యువతి అక్క వద్దకు ట్యూషన్కు వెళ్లే క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. గతేడాది కూడా వీరిద్దరూ ఇలాగే పారిపోయారు. తాజాగా బాలుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం, కిడ్నాప్ ఆరోపణల కింద యువతితో పాటు ఆమెకు సహకరించిన 21 ఏళ్ల స్నేహితుడిని అరెస్టు చేశారు.