గుజరాత్‌లోని సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన జరిగింది. విమానాశ్రయంలో తనను తాను కాల్చుకుని ఓ సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంటనే అధికారులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.