మణిపూర్లో జాతి విద్వేషం తీవ్రరూపం దాల్చింది. కుకీ, మెయితీ తెగల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల జిరిబామ్ జిల్లాలో కుకీ తెగకు చెందిన మహిళా టీచర్(31)పై అనుమానిత మెయితీ సాయుధులు పాశవికంగా అత్యాచారం చేసి దహనం చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'ఆమె శరీరం 99% కాలిపోవడంతో అత్యాచార నమూనాలు తీయడం సాధ్యం కాలేదు. 8 చోట్ల గాయాలున్నాయి. ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. పుర్రె వేరుపడింది' అని అటాప్సీ రిపోర్టు వెల్లడించింది.