సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిపై దాడికి పాల్పడ్డ 60 ఏళ్ల వృద్ధుడు

77చూసినవారు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యురాలిపై దాడికి పాల్పడ్డ 60 ఏళ్ల వృద్ధుడు
ఓ వైద్యురాలిపై రోగి సహాయకుడు దాడి చేసిన ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బన్సీలాల్ పేటకు చెందిన ఓ మహిళ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. అయితే రోగులకు చికిత్స అందించేందుకు జూనియర్ వైద్యురాలు ఎమర్జెన్సీ వార్డులోకి చేరుకుంది. ఈ క్రమంలో తన భార్యకు త్వరగా చికిత్స అందించాలంటూ ఆమె భర్త 60 ఏళ్ల ప్రకాశ్ సదరు వైద్యురాలిపై దాడి చేశాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది అడ్డుకుని డాక్టర్ ని రక్షించారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్