మణిపూర్ మంత్రి ఖాసిం ఇంట్లో పేలిన బాంబు

52చూసినవారు
మణిపూర్ మంత్రి ఖాసిం ఇంట్లో పేలిన బాంబు
మణిపూర్‌లో మంత్రి ఖాసిం వషుమ్ నివాసంలో శనివారం రాత్రి బాంబు పేలింది. ఉఖ్రుల్‌లోని హమ్లీఖోంగ్‌లో రాష్ట్ర పశుసంవర్ధక, రవాణా శాఖ మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF)లో ఆయన కీలక నేత. పేలుడు జరిగిన సమయంలో మంత్రి తన నివాసంలో లేరు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్