కారు ఢీ.. ఎగిరిపడ్డ బాలుడు (షాకింగ్ వీడియో)

64చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో నుంచి ముగ్గురు బాలురు బయటకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి ముగ్గురిలో ఓ బాలుడిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. అనంతరం బాలుడు లేచి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఢీకొట్టిన వ్యక్తులు వెంటనే కారులోని నుంచి దిగి బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

ట్యాగ్స్ :