కడప మేయర్ సురేష్ బాబుతో పాటు 15 మంది వైసీపీ నేతలపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి విధులకు ఆటంకం కల్పించారని అభియోగం మోపారు. అలాగే మేయర్ ఇంట్లో చెత్త వేసిన టీడీపీ నేత బొజ్జ తిరుమలేష్‌తో పాటు 15 మంది కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.