ఏపీలో కూడా హైడ్రా..?

54చూసినవారు
ఏపీలో కూడా హైడ్రా..?
తెలంగాణా రాజకీయాలను హడలెత్తిస్తున్న హైడ్రా టాపిక్ ఇపుడు ఏపీలో కూడా హాట్ హాట్ గా సాగుతోంది. ఏపీలో సైతం హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అన్నదే ఇపుడు చర్చగా సాగుతోంది. ఏపీలో కూడా హైడ్రా వస్తుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక విశాఖ జిల్లాలో తాజాగా పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్