బాలీవుడ్ నటిపై అత్యాచారం కేసును రాష్ట్ర ఐపీఎస్‌లు సెటిల్ చేశారన్న వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. కేసు వివరాలను పోలీసు శాఖ నుంచి ఏపీ సీఎంవో కార్యాలయం తీసుకుంది. ఈ క్రమంలో అప్పటి విజయవాడ సీపీ, డీసీపీలకు మరో రెండు రోజుల్లో షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ముంబైలో ఓ వ్యాపారవేత్త కుమారుడిపై నటి అత్యాచారం కేసు పెట్టగా.. విజయవాడలో ఆమెపై మరో కేసు పెట్టి అరెస్ట్ చేసి ముంబై కేసును సెటిల్ చేసినట్లు సమాచారం.