రాజస్థాన్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ చిన్నారిని కారు తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన జైపూర్‌లో జరిగింది. సంగనేర్‌లోని సీతాబారి వద్ద అక్రమ్(3) అనే చిన్నారి రోడ్డుపై వెళుతుండగా అటుగా వచ్చిన కారు అతడి మీదకు ఎక్కింది. వెంటనే స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.