కిరాణా దుకాణం యజమాని హత్య కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. ఆగస్టు 5న ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన తర్వాత ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. జులై 19న ఢాకాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో షాపు యజమాని మరణించారు. ఈ క్రమంలో ఆమెపై కేసు నమోదు చేశారు.