గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు నమోదు!

83చూసినవారు
గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు నమోదు!
మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గంగవ్వ, రాజు ‘మై విలేజ్ షో’ ఛానెల్‌లో మే 20, 2022న ‘చిలుక పంచాంగం’ వీడియో పేరుతో చిలుకను బంధించారని.. ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ ప్రారంభించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ పి. పద్మారావు చెప్పారు.

సంబంధిత పోస్ట్