ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైలు పట్టాలు తప్పించే కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు ఈ ఘటన జరిగింది. అటుగా వెళ్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ సిలిండర్ ను గుర్తించి ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును ఆపడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.