వంట విషయంలో గొడవ పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్‌లోని సోన్‌గఢ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పవార్ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి సోన్‌గఢ్‌లో నివాసముంటున్నాడు. శుక్రవారం వంట విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఇద్దరు కూతుళ్లతో సహా కాలువలో దూకేసింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభించగా ఇంకొకరి మృతదేహాం కోసం గాలిస్తున్నారు.