న్యూఢిల్లీలోని ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 73 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ జాబ్స్ ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గేట్-2025 స్కోరు ఉండాలి. ఈ గేట్ స్కోరు ఆధారంగానే ఆయా పోస్టుల్లో ఖాళీలకు ఎంపిక చేస్తారు. మార్చి 18, 2025 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ. వివరాలకు https://gailonline.com చూడొచ్చు.