ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఒక చిన్న పాప, డాల్ఫిన్ మధ్య స్నేహపూర్వక సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్వేరియంలోని డాల్ఫిన్‌ను చూసిన చిన్నారి ఎంతో ఉత్సాహంగా ఎగురుతూ హాయ్ చెప్పింది. అది చూసిన డాల్ఫిన్ వెంటనే అక్కడ ఆగి చిన్నారిని పలకరిస్తున్నట్లుగా నోరు తెరిచింది. తన తోకపై నీటిలో నిల్చొని పాపతో ఏదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ చిన్నారి వెంటనే దానికి దగ్గరగా వెళ్లి ఎంతో మురిసిపోయింది.