ట్యూషన్ వెళ్లొస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం

77చూసినవారు
ట్యూషన్ వెళ్లొస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం
పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాల్లో జరిగిన హత్యాచార ఘటనలు మరువక ముందే దేశంలో మరో దారుణం చోటుచేసుకుంది. అస్సాం నాగోన్ జిల్లా దింగ్ ప్రాంతంలో ట్యూషన్‌కు వెళ్లొస్తున్న 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. సమీప చెరువు వద్ద వివస్త్రగా పడున్న బాలికను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్