JustDial లాభంలో 43% వృద్ధి

55చూసినవారు
JustDial లాభంలో 43% వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) డిసెంబర్ త్రైమాసికంలో స్థానిక సెర్చ్ ఇంజిన్ JustDial రూ.131.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.92.01 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 42.7 శాతం అధికం. కంపెనీ కార్యకలాపాల ఆదాయం 8.4% పెరిగి రూ.287.33 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం కూడా 7.3% పెరిగి రూ.364.74 కోట్లకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్