మునగాకు ఆయిల్‌ని కొబ్బరి, జొజొబా, ఆముదం ఆయిల్స్.. ఈ మూడింటిలో ఏదో ఓ దానిలో కలిపి తలకి మసాజ్ చేయాలి. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నీటిలో మునగాకులో వేసి వాటిని బాగా మరిగించాలి. ఇవి చల్లగా అయ్యాక స్ప్రే బాటిల్‌లో వేసి స్ప్రే చేయాలి. అదే విధంగా, ఈ నీటితో తలస్నానం చేసేటప్పుడు జుట్టుని కడగండి. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే.. మునగాకుని జ్యూస్‌లా చేసుకుని తాగడం వల్ల కూడా హెయిర్‌లాస్ తగ్గుతుంది.