గ్రౌండ్‌ స్టాఫ్‌కు భారీ నజరానా

58చూసినవారు
గ్రౌండ్‌ స్టాఫ్‌కు భారీ నజరానా
ఐపీఎల్ 17వ సీజన్ విజయవంతంగా ముగిసింది. రెండు నెలలకుపైగా సాగిన ఈ సీజన్‌ విజయవంతం కావడంలో గ్రౌండ్‌ సిబ్బంది విశేష కృషి ఉంది. దీంతో వారికి మద్దతుగా నిలిచేందుకు బీసీసీఐ కార్యదర్శి జైషా నజరానా ప్రకటించారు. ‘‘10 రెగ్యులర్‌ మైదానాల్లో ఒక్కోదానికి రూ. 25 లక్షలు, అదనంగా మరో మూడు వేదికలకు పదేసి లక్షలను ఇస్తున్నాం. సిబ్బంది, క్యురేటర్‌ నిబద్ధతకు, కష్టానికి ధన్యవాదాలు’’ అని జై షా పోస్టు తాజాగా చేశారు.

సంబంధిత పోస్ట్