కనుమ రోజు కాకులు కూడా ఎక్కడికీ కదలవని అంటారు. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరాదని మన పూర్వీకులు అంటారు. దీనికి కారణం పాత రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండిలోనే జరిగేవి. ఏడాదికి ఒక్కసారి వచ్చే కనుమ రోజు కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులు కష్టపడకుండా విశ్రాంతిగా ఉంచేందుకే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదని నియమం ఏర్పడింది. ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు అంటారేమో. ఏడాదికోసారి ఊరికి వస్తారు కాబట్టి ఇవాళ బంధుమిత్రులతో సరదాగా గడపండి.