జెట్ ఎయిర్‌వేస్ వ్యవహారంలో కీలక పరిణామం

64చూసినవారు
జెట్ ఎయిర్‌వేస్ వ్యవహారంలో కీలక పరిణామం
ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్‌వేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో గతంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును అప్పిలేట్ ట్రైబ్యునల్ సమర్థించింది. దివాలా ప్రక్రియలో విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచిన జలాన్ కర్లాక్ కన్సార్షియంకు 90 రోజుల్లో హక్కులను బదిలీ చేయాలని మానిటరింగ్ కమిటీని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్