అలాంటి రూమర్స్‌ నమ్మొద్దు: మంచు మనోజ్‌

2911చూసినవారు
అలాంటి రూమర్స్‌ నమ్మొద్దు: మంచు మనోజ్‌
మనోజ్‌ సతీమణి మౌనిక కవలలకు జన్మనిచ్చారంటూ ఇటీవల పలు యూట్యూబ్‌ ఛానళ్లు స్టోరీలు క్రియేట్‌ చేశాయి. అవి కాస్తా వైరల్‌ కావడంతో వాటిపై స్పష్టత ఇచ్చేందుకు ఎక్స్‌ వేదికగా మనోజ్‌ స్పందించారు. ‘‘మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా సతీమణి ఏడో నెల గర్భవతి. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సమయం వచ్చినప్పుడు మేమే ఆనందాన్ని మీతో స్వయంగా పంచుకుంటాం’’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్