పాకిస్థాన్ లెజెండరీ బౌలర్ వకార్ యూనిస్కు కీలక స్థానం లభించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) చీఫ్‌కు సలహాదారుగా వకార్ నియమితులయ్యారు. ఇకపై పీసీబీకి సంబంధించిన అన్ని క్రికెట్ వ్యవహారాలను ఈ మాజీ స్పీడ్‌స్టర్ చూసుకోనున్నారు. పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీకి అడ్వైజర్‌గా ఆగస్టు 1న వకార్ బాధ్యతలు చేపట్టనున్నారు.