రోజురోజుకు పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పెట్రోల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో వాహనాలన్నీ ఇథనాల్, విద్యుత్‌తోనే నడుస్తాయని తెలిపారు. దాంతో లీటర్ పెట్రోల్ ధర రూ.15కే వస్తుందని అన్నారు. రైతులు పండించే పంటలతో ఇథనాల్ తయారవుతుందని, రైతులు కూడా ఇంధన ప్రదాతలుగా మారుతారని చెప్పారు. దీని వల్ల రూ.16 లక్షల కోట్ల విలువైన పెట్రోల్ దిగుమతులు తగ్గుతాయని పేర్కొన్నారు.