వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుంటే జరిగే మోసాలను సులువుగా అరికట్టవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. గతంలో ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన లేదన్నారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాల్సిన అవసరం ఉందన్నారు.