చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన స్కూల్ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మరణించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఆగ్రాకు చెందిన 28 ఏళ్ల మనోజ్ కుమార్ ఢిల్లీలోని రంగపురిలో నివసిస్తున్నాడు. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్న మనోజ్ కుమార్.. వసంత్ కుంజ్ ప్రాంతంలోని మహిపాల్‌పూర్ ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు దాటాడు. అదే సమయంలో స్కూల్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.