జమ్మూ కశ్మీర్‌లో
భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 2.53 గంటల ప్రాంతంలో కిష్త్వార్‌లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై
భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి పది కిలోమీటర్ల లోతులో
భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. కాగా, 24 గంటల వ్యవధిలో ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి. అంతకు ముందు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో
భూకంపం సంభవించింది.