వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలో వరి, గోధుమ దిగుబడులు 6 నుంచి 10 శాతం వరకు తగ్గిపోయే ప్రమాదం ఉందని భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ డీజీ మృత్యుంజయ పాత్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది రైతులు, ఆహార భద్రత పై ప్రభావం చూపిస్తుందని అన్నారు. 2023 –24లో గోధుమ ఉత్పత్తి 113.9, వరి ఉత్పత్తి 137 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 14శాతం. అయితే ఇది 2050 నాటికి 7 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా.