ఓపెన్‌ AI నుంచి కొత్త సెర్చింజిన్‌

61చూసినవారు
ఓపెన్‌ AI నుంచి కొత్త సెర్చింజిన్‌
గూగుల్‌కు పోటీగా ఓపెన్‌ఎఐ సెర్చింజిన్‌ను తీసుకొస్తోంది. చాట్‌జిపిటితో రాణిస్తున్న ఓపెన్‌ఎఐ తాజాగా ‘సెర్చ్‌జిపిటి’ పేరుతో నూతన విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. ఇంటర్నెట్‌లోని రియల్‌టైమ్‌ డేటాను ఈ AI ఆధారిత సెర్చింజిన్‌ యూజర్లకు అందించనున్నట్లు వెల్లడించింది. పరిమిత గ్రూప్‌, పబ్లిషర్లతో పరీక్షిస్తున్నామని ఓపెన్‌ఎఐ తెలిపింది. ప్రస్తుతం సెర్చింజిన్‌ మార్కెట్‌లో గూగుల్‌ 91 శాతం వాటాను కలిగి ఉంది.

సంబంధిత పోస్ట్