హైదరాబాద్‌లోని గాజులరామారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెక్యూరిటీగా పనిచేస్తున్న బాషా గోపి (38) అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడిని 20 ఏళ్ల మనీష్ గౌడ్‌గా గుర్తించారు. గౌడ్, అతని స్నేహితులు ఎస్‌యూవీలో ప్రయాణిస్తుండగా అదుపు తప్పిన కారు బాషా గోపిని ఢీకొట్టారు. నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.