అరుదైన ఘటన.. ఏనుగుకు కవల పిల్లలు

56చూసినవారు
అరుదైన ఘటన.. ఏనుగుకు కవల పిల్లలు
థాయ్‌లాండ్‌లోని రాయల్ క్రాల్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆయుత్తాయ ఎలిఫెంట్ ప్యాలెస్‌లో చంచూరి(35) అనే ఏనుగుకు కవల పిల్లలు జన్మించాయి. ఇందులో ఆడ, మగ ఏనుగు ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఏనుగులకు కవలలు జన్మించేందుకు ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అవి 22 నెలలపాటు గర్భధారణతో ఉంటాయి. నాలుగేళ్లకోసారి పిల్లలకు జన్మనిస్తాయి.

సంబంధిత పోస్ట్