రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటరులో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు. బీహార్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి జేఈఈ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. ఏడాది కాలంగా తన తల్లితోపాటు కోటాలోని తలవండి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. అయితే, ఆదివారం రాత్రి డిన్నర్ చేసిన తర్వాత తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.