TG: మనకు తెలిసిన వాళ్లలో ఎవరికో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే వావ్ గ్రేట్ అంటూ తెగ పొగిడేస్తుంటాం. అలాంటిది ఊర్లో ఓ తలుపుతట్టినా ఏ కుటుంబాన్ని కదిలించినా ప్రభుత్వ ఉద్యోగులే ఎదురువుతుంటారు. ఈ గ్రామం ఎక్కడో కాదండోయ్.. తెలంగాణలో మెదక్ జిల్లా అక్కన్నపేట గ్రామంలో. పేరకు మారుమూల గ్రామమే కానీ.. ఉరిలో ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరో ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.