ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి ఆడుకునే బొమ్మ కింద ఓ భయంకరమైన పాము కనపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. చిన్నారులు ఆడుకునే బౌన్సీ చైర్‌లో పామును గుర్తించిన కుటుంబ సభ్యులు.. పాములు పట్టే వాళ్లకు ఫోన్ చేశారు. దీంతో పాములు పట్టేవారు వచ్చి ఆ పామును పట్టి సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.