బిజెపి 1998లో కేంద్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చేవరకూ సెప్టెంబరు 17ను పట్టించుకోలేదు. నాడు ఈ విలీనం ప్రక్రియకు సర్దారు పటేల్ ఆధ్వర్యం వహంచినందున అద్వానీ అభినవ సర్దారు అని ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి బిజెపికి నిజాం వ్యతిరేక పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేదు. సాయుధ పోరాటం కోసం పిలుపునిచ్చిన ముగ్గురిలో ముగ్దుం ఒకరు. స్టేట్ కాంగ్రెస్ పేరిట కొన్ని చర్యలు జరిగినా వాస్తవంలో కాంగ్రెస్ ఎజెండాలో సంస్థానాలపై పోరాటమే లేదు. పైగా భూస్వాములతో దోస్తీ కట్టింది.