సైనికులు ప్రయాణిస్తున్న వాహనం 700 అడుగుల లోయలో పడిపోవడంతో నలుగురు సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఇవాళ సిల్క్ రూట్‌గా ప్రసిద్ధి చెందిన రెనోక్ రోంగ్లీ రాష్ట్ర హైవే వెంబడి దలోప్‌చంద్ దారా వద్ద జరిగింది. బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను డ్రైవర్ ప్రదీప్ పటేల్, క్రాఫ్ట్‌మన్ డబ్ల్యూ పీటర్, నాయక్ గురుసేవ్ సింగ్, సుబేదార్ కె.తంగపాండిగా గుర్తించారు.