అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి భూమిపైకి తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ నుంచి 'వింత శబ్దాలు' వస్తున్నాయి. వారు ఉన్న స్పేస్‌క్రాఫ్ట్ నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని బుచ్ విల్మోర్ హ్యూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌కు తెలిపారు. ఈ మేరకు వారు రికార్డ్ చేసిన ఓ ఆడియో ఫైల్ పంపించారు. స్పేస్ క్రాఫ్ట్ లోపలి నుంచి వచ్చే శబ్ధం జలాంతర్గామి సోనార్‌ను పోలి ఉందని బుచ్ విల్మోర్ చెప్పారు.