చైతన్యానికి ప్రతీక

84చూసినవారు
చైతన్యానికి ప్రతీక
కన్నయ్య వేణువులోని రంధ్రాలు జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనసులకు సంకేతాలు. పరమాత్మ వేణువూది వాటిని చైతన్యవంతం చేస్తాడు. నెమలి స్వేచ్ఛ, శాంతి, శుభం, పవిత్రతలకు చిహ్నం. నెమలి పింఛాన్ని తలమీద ధరించి వాటి ప్రాధాన్యాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. ‘కర్షతి చిత్తమితి కృష్ణః’.. చిత్తాన్ని ఆకర్షించేవాడు శ్రీకృష్ణుడు. తన సమ్మోహన శక్తితో గోపికావల్లభుడయ్యాడు. రాధామనోహరుడయ్యాడు. భక్తులకు చేరువయ్యాడు. శ్రీకృష్ణ తత్త్వం ప్రేమమయం.

సంబంధిత పోస్ట్