హైదరాబాద్ లోని లాలాగూడ పిఎస్ పరిధిలో ఓ దుండగుడు పెట్రోల్ దాడి చేశాడు. రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన టపాసుల దుకాణంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. నిందితుడు పారిపోతున్న దృశ్యాలు సీసీటీవి కెమరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాద సమయంలో షాపులో ఇద్దరు వ్యక్తులు నిద్రిస్తున్నారు. అయితే యజమానుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.