కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి డైరీలో చిరిగిన పేజీ!

68చూసినవారు
కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి డైరీలో చిరిగిన పేజీ!
కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. ‘‘మా అమ్మాయి బ్యాగులో ఎప్పుడూ పర్సనల్‌ డైరీ ఉంటుంది. దాన్ని మేం ఎప్పుడూ చదవలేదు. ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉంది. దానికి సంబంధించిన ఫొటో నా వద్ద ఉంది’’ అని బాధితురాలి తండ్రి వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్