మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని డల్లాస్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రవాస భారతీయులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ‘అర్థవంతమైన చర్చల్లో పాల్గొని రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు వేచి చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.