పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ (సంధ్య) తన భర్త (సునీల్)తో ఉన్న గొడవల కారణంగా.. ఆయన చనిపోయిన తర్వాత కూడా మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకుంది. బంధువులు ఎంత చెప్పినా వినకుండా రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహాం ఉండేలా చేసింది. ఇంతా చేసి చివరికి తన కుమారుడితో కనీసం తండ్రికి తలకొరివి కూడా పెట్టనీయకుండా తీసుకెళ్లిపోయింది. ఇదంతా చేసింది తన భర్త ఆస్తిలో వాటా కోసం కావటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.