ప్రేమించట్లేదని యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు (వీడియో)

152579చూసినవారు
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించినందుకు ఓ యువకుడు యువతిని కిరాతకంగా చంపేశాడు. హుబ్లిలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహ (24) BVB కాలేజీలో చదువుతోంది. సీనియర్ అయిన ఫయాజ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. నేహ అతని ప్రేమని నిరాకరించడంతో యువతి మెడపై విచక్షణ రహితంగా 9సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్