దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అత్యధిక నిరుద్యోగ శాతమున్న రాష్ట్రంగా కేరళ నిలవగా, తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో ఈ ఏజ్ గ్రూప్ నిరుద్యోగుల్లో టాప్ 5 రాష్ట్రాలు కేరళ 31.8 శాతం, జమ్మూ,కశ్మీర్ 28.2, తెలంగాణ 26.1, రాజస్థాన్ 24, ఒడిశాలో 23.3 శాతం ఉన్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఈ ఏజ్‌గ్రూప్‌లో మొత్తంగా నిరుద్యోగిత శాతం జనవరి-మార్చి మధ్యలో 17 శాతంగా ఉంది.